నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ మీద 'అపరిశుభ్ర పరిసరాల మధ్య నాగర్‌కర్నూల్ కలెక్టరేట్' పేరిట ఈనెల 4న ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి స్పందన లభించింది. ఈటీవీ భారత్‌లో ప్రసారమైన కథనాన్ని డీఆర్ఓ మధుసుధన్ చూశారు.
కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిటికీలో నుంచి టీ కప్పులు, వాటర్‌బాటిల్ ఇతర సామగ్రి వేయరాదని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.