తెలంగాణ

telangana

ETV Bharat / state

పెంట్లవల్లి మండలంలో కలెక్టర్​ పర్యటన

30 రోజుల ప్రణాళికలో భాగంగా నాగర్​కర్నూల్​ జిల్లా పెంట్లవల్లి మండలంలోని పలు గ్రామాలను కలెక్టర్ శ్రీధర్, జడ్పీ ఛైర్​పర్సన్​ పద్మావతి సందర్శించారు. గ్రామంలో సమస్యలను గుర్తించి పరిష్కారం చేసుకోవాలని సూచించారు.

పెంట్లవల్లి

By

Published : Sep 17, 2019, 9:36 PM IST

ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని స్పష్టం చేశారు నాగర్​కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్. జిల్లాలోని జటప్రోలు, గోప్లాపూర్ గ్రామాల్లో కలెక్టర్ శ్రీధర్, జడ్పీ ఛైర్​పర్సన్​ పద్మావతి, ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, పరిసరాల పరిశుభ్రత మొదలైన సమస్యల గురించి గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. మొక్కలు నాటాలని సూచించారు. పాలనాధికారి శ్రీధర్ పార పట్టి చెత్తను ఊడ్చారు.

కలెక్టర్​ పర్యటన

ABOUT THE AUTHOR

...view details