తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి పోటెత్తిన భక్తజనం - ములుగు జిల్లా తాజా వార్తలు

మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. వన దేవతలకు మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో అడవిలో చెట్ల కింద బస చేస్తున్నారు.

large number of devotees came to Medaram Sammakka Saralamma temple in mulugu district
సమ్మక్క సారలమ్మల గద్దెల వద్ద పోటెత్తిన భక్తజనం

By

Published : Jan 31, 2021, 4:16 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి వన దేవతల సన్నిధికి చేరుకున్నారు.

జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తల నీలాలు సమర్పించుకుని అమ్మ వార్ల దర్శనం చేసుకుంటున్నారు. నిలువెత్తు బంగారం (బెల్లం)తో సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులకు మొక్కులు సమర్పించుకుంటున్నారు.

ఎంతో సంతోషంగా ఉంటుంది...

సమ్మక్క సారలమ్మల సన్నిధిలో ఎంతో సంతోషంగా ఉంటుందని భక్తులు అంటున్నారు. వన దేవతల దీవెనలు ఉంటే ఎలాంటి ఆపదలైనా తొలగిపోతాయని చెప్పారు. అందుకే ఏటా మేడారం వస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో అడవిలో చెట్ల కింద బస చేస్తున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో పెరుగుతున్న స్కిజోఫ్రీనియా కేసులు

ABOUT THE AUTHOR

...view details