దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక సీసీ కెమెరాలు ఉన్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. నేరాల పరిశోధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. మేడ్చల్ జిల్లా మల్లాపూర్‌లోని నోమ ఫంక్షన్హాల్లో జరిగిన కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. మన ఏరియాలో 100కు పైగా సీసీ కెమెరాలు ఒకేసారి ప్రారంభించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు.
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలే కీలకం: సీపీ మహేశ్ భగవత్
నేరాలను అదుపు చేయడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. మేడ్చల్ జిల్లా మల్లాపూర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
రాచకొండ పరిధిలో మొత్తం 1,25,464 సీసీ కెమెరాలు ఉండగా... బంజారాహిల్స్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేయబడతాయని సీపీ తెలిపారు. 3 కమిషన రేట్ల పరిధిలో దాదాపు 6 లక్షల సీసీ కెమెరాలు ఉన్నట్లు వివరించారు. ఘట్కేసర్ కేసులో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని వివరించారు. సీసీ కెమెరాలతో ట్రాఫిక్ జామ్, నేరాలను నియంత్రించవచ్చని వెల్లడించారు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా 100 కి కాల్ చేయాలని సీపీ మహేశ్ భగవత్ సూచించారు. కమ్యూనిటీ హాల్స్, అపార్ట్మెంట్లలో సీసీ కెమెరాలు చాల అవసరమని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ అన్నారు.
ఇదీల చూడండి:ఇళ్లైనా, పెళ్లైనా తెరాసతోనే సాధ్యం: కేటీఆర్