ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లోని మహిళా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో కవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు. విద్య ద్వారానే ఆత్మవిశ్వాసం పెంపొందుతుందన్నారు. బాలికల చదువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ గురుకులాలతోపాటు విదేశీ విద్యకు సైతం తోడ్పాటు అందిస్తుందన్నారు.
'ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలు ముందుకు సాగాలి'
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లోని మహిళా సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలని కవిత సూచించారు.
'ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలు ముందుకు సాగాలి'
మహిళలు ఉన్నతంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్... వీ-హబ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలు జీవితంలో అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారని... మహిళల మీద అఘాయిత్యాలు అరికట్టడానికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన మాటలకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది.