తెలంగాణ

telangana

ETV Bharat / state

రేవంత్​ రెడ్డి అరెస్టును ఖండిస్తూ.. నల్ల బ్యాడ్జీలతో నిరసన!

శ్రీశైలం విద్యుత్​  ప్రమాద ఘటనలో మరణించిన, గాయపడిన కుటుంబాలను పరామర్శించేదుకు వెళ్తున్న మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​రెడ్డిని అరెస్టు చేసి.. పోలీసులు అదుపులోకి తోసుకోవడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్​ అన్నారు. రేవంత్​ రెడ్డి అరెస్టుకు నిరసనగా జీడిమెట్లలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

Medchal DCC proetest Against Revanth Reddy Arrest
రేవంత్​ రెడ్డి అరెస్టును ఖండిస్తూ.. నల్ల బ్యాడ్జీలతో నిరసన!

By

Published : Aug 22, 2020, 9:39 PM IST

మేడ్చల్​ జిల్లా జీడిమెట్లలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద ఎంపీ రేవంత్​ రెడ్డి అరెస్టును ఖండిస్తూ.. మేడ్చల్​ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం అధ్వర్యంలో కాంగ్రెస్​ కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీశైలం విద్యుత్​ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తే అన్యాయంగా అరెస్టు చేసి పోలీసుల అదుపులో ఉంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్షాలను ప్రతిచోట అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి అంబేడ్కర్​ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. విద్యుత్​ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేని పక్షంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.

ఇవీచూడండి:ఆ గంటలో ఏం జరిగింది ? ప్రమాదం ఎందుకు సంభవించింది ?

ABOUT THE AUTHOR

...view details