తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2020, 8:14 PM IST

ETV Bharat / state

బీరు సీసాలతో దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో బుధవారం అల్వాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో శ్రీకాంత్​ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసి గాయపరచిన వ్యక్తులను అల్వాల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి రిమాండ్​కు తరలించినట్లు అల్వాల్​ ఇన్​స్పెక్టర్ యాదగిరి తెలిపారు.

criminals who was-attacked-man with-beer-bottle-in-alwal got arrested
బీరు సీసాలతో దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో బుధవారం అల్వాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో శ్రీకాంత్​ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేసి గాయపరచిన వ్యక్తులను అల్వాల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. సూర్య నగర్​లో నివాసముండే శ్రీకాంత్​... తన పని ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో మద్యం దుకాణానికి వెళ్లాడు. అక్కడ అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయి కిరణ్, కార్తీక్, కిరణ్, వినోద్​, రవిలు బీరు కొనుక్కుని వారి బైకులో పెట్టే క్రమంలో అవి కిందపడ్డాయి.

బీరు సీసాలు కిందపడ్డాయని శ్రీకాంత్​ నవ్వగా.. వారి మధ్య గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పగిలిన బీరు సీసాలతో శ్రీకాంత్​పై దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడ్డ శ్రీకాంత్​ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వారిని పట్టుకుని రిమాండ్​కు తరలించినట్లు అల్వాల్​ ఇన్​స్పెక్టర్ యాదగిరి తెలిపారు.

ఇదీ చదవండిఃఇంటికెళుతుంటే అడ్డుకున్నారు.. బీరు సీసాతో విచక్షణారహితంగా కొట్టారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details