మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో ఈరోజు 180 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 42 మందికి పాజిటివ్ వచ్చిందని సూపరింటెండెంట్ డాక్టర్ రాజు వెల్లడించారు. కరోనా పరీక్షల కోసం ఆస్పత్రికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
మల్కాజిగిరిలో కరోనా కలవరం... ఒక్కరోజే 42 మందికి పాజిటివ్
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో 180 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 42 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. లక్షణాలులేని వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూపరింటెండెంట్ డాక్టర్ రాజు సూచించారు. ఆస్పత్రిలో పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటిస్తే కరోనాను జయించవచ్చని పేర్కొన్నారు.
corona
పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేకుంటే హోం ఐసోలేషన్‌లో ఉండాని సూచించారు. లక్షణాలు ఉన్నవారికి ఐసోలేషన్ పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆందోళన చెందకుండ జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాధి నయమవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :ప్రగతి భవన్కు చేరుకున్న సీఎం కేసీఆర్