మెదక్ జిల్లా రామాయంపేట వాసులు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు.ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రమ్ములు పెట్టారు. వాటిలోకి ట్యాంకర్ల ద్వారా నీటిని నాలుగు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. అవి సరిపోవడం లేదని నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటికోసం పనులు మానుకుని ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి పలుమార్లు వెళ్లినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెదక్ జిల్లాలో చుక్క నీరు దొరకడం లేదు...
తినడానికి బుక్కెడు బువ్వ దొరుకుతుంది కానీ గొంతు తడుపుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. సూర్యుడి ప్రతాపంతో భూతల్లి బోరు మంటోంది. జలం లేక మెదక్ జిల్లా రామాయంపేట ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
నీరే బంగారమయ్యనా...