తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థినులపై దూషణలు.. కళాశాల ప్రిన్సిపల్​పై వేటు - ప్రిన్సిపల్​పై వేటు

మెదక్​ జిల్లా కొల్చారంలోని సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమను ప్రిన్సిపల్​ అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని ఆరోపించారు. విచారణ జరిపిన అధికారులు ఆ ప్రిన్సిపల్​పై వేటు వేశారు.

కళాశాల

By

Published : Apr 12, 2019, 6:34 PM IST

Updated : Apr 12, 2019, 6:45 PM IST

మెదక్​ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు కళాశాల గేటు ముందు ధర్నా చేశారు. తమను ప్రిన్సిపల్​ అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే అతన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్​ చేశారు. సమాచారం అందుకున్న రీజనల్​ కోఆర్డినేటర్​ బాలస్వామి విచారణ జరిపి ప్రిన్సిపల్​ను తొలగించారు.

ఆందోళన చేస్తున్న విద్యార్థినులు
Last Updated : Apr 12, 2019, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details