తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండు నెలలుగా ఎదురు చూస్తున్నాం.. ఇకనైనా స్పందించండి..!

వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మెదక్ జిల్లా రైతులు డిమాండ్ చేశారు. గన్నీ బ్యాగుల కొరత, ఐకేపీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలలుగా తాము పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్​ స్పందించి తక్షణమే ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాలని వేడుకున్నారు.

farmers are aware that grain is not being purchased
ధ్యాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు

By

Published : Jun 4, 2021, 10:16 PM IST

గన్నీ బ్యాగుల కొరత, ఐకేపీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తాము పండించిన ధాన్యం రెండు నెలలుగా కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని మెదక్ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని తమ గోడు వెల్లబోసుకున్నారు.

సరైన సమయంలో పంటను కొనుగోలు చేయకపోవడం కారణంగా టార్పాలిన్​ల కిరాయి భారం కూడా తమపైనే పడుతోందని మెదక్ జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అవుసులపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నెలల నుంచి పంటను కొనుగోలు చేయడంలేదని తెలిపారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్​ తక్షణమే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలని వేడుకున్నారు.

ఇదీ చదవండి:Suicide attempt: మేడ పైనుంచి దూకబోయిన కరోనా రోగి..

ABOUT THE AUTHOR

...view details