ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. కొల్చారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 10సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచి వర్షాలు పడుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ఆనందంలో రైతులు
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొల్చారంలో 10సెంటిమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు కురవడం వల్ల అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో విస్తారంగా వర్షాలు.. ఆనందంలో రైతన్న
ఆయా మండలాల్లోని చాలా చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరగా... కొన్ని చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడం వల్ల కొల్చారం , మెదక్, హవేలీ ఘన్పూర్ మండలాల పరిధిలోని మహబూబ్ నగర్ కాలువ నిండుగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురిసి చెరువులు నిండడం వల్ల రైతుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.
ఇవీ చూడండి: కొత్తగూడెంలో భారీ వర్షం... బొగ్గు ఉత్పత్తికి ఆటంకం