మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నాయిపల్లి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి.. పదిహేడు మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పారిపోగా... పదిహేను మందిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
17 మంది పేకాటరాయుళ్లు అడ్డంగా బుక్కయ్యారు - crime news
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్మాయిపల్లిలో పేకాట స్థావరంపై దాడిచేసి పదిహేడు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2.38 లక్షలు, పది చరవాణులు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశారు.

17 మంది పేకాటరాయుళ్లు అడ్డంగా బుక్కయ్యారు
గతకొంత కాలంగా పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేశారు. ఈ సోదాల్లో 17 మంది అడ్డంగా పట్టుబడ్డారు. హైదరాబాద్, పటాన్‌చెరు పరిసరాలకు చెందిన వారు ఉన్నారన్నారు. రూ. 2.38 లక్షల నగదు, పది చరవాణులు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్రవాహనాలు, పేకాట కార్డులు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.