మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల నిరసనలు కొనసాగుతున్నాయి. బస్టాండ్ నుంచి జైపూర్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టి మిగిలిన 25 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు నినదించారు. ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ