తెలంగాణ

telangana

ETV Bharat / state

మంచిర్యాలలో నిర్బంధ తనిఖీలు - police

మంచిర్యాల పట్టణంలో పోలీసుల నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 48 వాహనాలను సీజ్ చేశారు. గడువు లోపు ఆధారాలు చూపి వాహనాలు తీసుకువెళ్లవచ్చని పోలీసులు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు

By

Published : Feb 11, 2019, 3:25 PM IST

మంచిర్యాలలో పోలీసులు నిర్బంధ తనిఖీలు
మంచిర్యాల డీసీపీ వేణుగోపాల రావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులు జిల్లా కేంద్రంలోని ఆండాళమ్మ కాలనీలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు, 5 ట్రాక్టర్లు, 1 ఆటో ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే నిర్బంధ సోదాలు నిర్వహిస్తున్నామని డీసీపీ తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తులకు ఇల్లు అద్దెకు వస్తే అన్ని వివరాలు తీసుకోవాలని వేణుగోపాల్ రావు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details