తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ ఫలితాలే లోక్​సభ ఎన్నికల్లో పునరావృతమవుతాయి'

ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితాలు..  పార్లమెంట్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపునకు సంకేతాలిస్తున్నాయని మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వంశీచంద్​ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్​ ప్రభుత్వం రైతు సమస్యలను పెడచెవిన పెట్టిందని ఆరోపించారు.

మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి

By

Published : Mar 27, 2019, 11:44 PM IST

మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి
శాసనమండలి ఎన్నికల్లో అన్నిచోట్ల తెరాస అభ్యర్థులు ఓడిపోవడం... ప్రజల్లో గులాబీదళంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని మహబూబ్​నగర్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వంశీచంద్​ రెడ్డి అన్నారు. నిజామాబాద్​లో 250 మంది అన్నదాతలు ఎన్నికల బరిలో ఉన్నారంటే.. కేసీఆర్​ సర్కార్​పై రైతులకు ఉన్న వ్యతిరేకత అర్థం చేసుకోవచ్చన్నారు. పాలమూరు జిల్లాలోని రెండుస్థానాల్లో హస్తం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చే నెల 1న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ వనపర్తికి రానున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details