తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2019, 8:45 AM IST

ETV Bharat / state

'శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులకు సహకరించండి'

జిల్లాలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని... రానున్న వినాయక చవితి, మొహరం పండుగల పట్ల జాగ్రత్తలు వహించాలని మహబూబ్ నగర్ జిల్లా ఇన్​ఛార్జ్ సంయుక్త కలెక్టర్ స్వర్ణలత అభిప్రాయపడ్డారు.

'శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులకు సహకరించండి'

రానున్న పండుగల పర్వదినాలను పురస్కరించుకుని మహబూబ్​నగర్ కలెక్టరేట్​లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శాంతి సమావేశం నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సంయుక్త కలెక్టర్ స్వర్ణలత ఆదేశించారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పకుండా అనుమతులు తీసుకోవాలని... శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేసి అన్ని మండపాల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహించనున్నామని ఎస్పీ తెలిపారు.

'శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులకు సహకరించండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details