కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను దారి మళ్లించి....నిధులివ్వడం లేదని....తెరాస దుష్ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్రావు ఆరోపించారు. మహబూబ్నగర్ భాజపా కార్యాలయంలో రాష్ట్ర నాయకులతో సమావేశంలో పాల్గొన్నారు. అమృత్ పథకానికి సంబంధించిన నిధులను పక్కదారి మళ్లించారని విమర్శించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భవ, అగ్రవర్ణాల నిరుపేదలకు 10శాతం రిజర్వేషన్లు, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన లాంటి పథకాల్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ఎదురుదాడికి దిగారు.
కేంద్రం తెచ్చిన పథకాలు తెలంగాణకు వర్తించవా? - MLC Ramchandar Rao
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భాజపా నాయకులతో ఎమ్మెల్సీ రాంచందర్ రావు సమావేశయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో కేంద్రం నిధులున్నాయని పేర్కొన్నారు.

కేంద్రం తెచ్చిన పథకాలు తెలంగాణకు వర్తించవా?
కేంద్రం తెచ్చిన పథకాలు తెలంగాణకు వర్తించవా?