పండ్ల రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పండ్ల బజార్లను ప్రారంభించామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఉద్యానశాఖ, డీఆర్డీఏ ఆధ్వర్యంలో మామిడి విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నాణ్యమైన మామిడిని రైతుల నుంచి కొనుగోలు చేసి ప్రజలకు విక్రయించనున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల రైతులకు మంచి ధర, ప్రజలకు ఆరోగ్యకరమైన పళ్లు అందించిన వాళ్లమవుతామని చెప్పారు.
మామిడి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి - minister srinivas goud
మహబూబ్‌నగర్‌లో ఉద్యానశాఖ, డీఆర్డీఏ ఆధ్వర్యంలో మామిడి విక్రయ కేంద్రాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. పండ్ల రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే పండ్ల బజార్లను ప్రారంభించామని అన్నారు.

మామిడి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
పంట అధికంగా ఉంటే ఇతర దేశాలకు సైతం పాలమూరు మామిడి పేరిట వాటిని ఎగుమతి చేయాలని ఆయన సూచించారు. ఒకే రకం కాకుండా అన్నిరకాల పండ్లను ఈ విక్రయ కేంద్రంలో అందుబాటులో ఉంచాలని ఆయన నిర్దేశించారు. హన్వాడ మండల సమాఖ్య నిర్వహిస్తున్న విక్రయ కేంద్రంలో కేవలం కార్బైడ్ లేకుండా సహజ పద్ధతిలో మాగబెట్టిన పండ్లను మాత్రమే అమ్మాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
ఇవీ చూడండి: స్వప్నం సాకారం.. కొహెడ మార్కెట్ మే 2న ప్రారంభం