తెలంగాణ

telangana

By

Published : Dec 13, 2020, 12:21 PM IST

ETV Bharat / state

'పట్టణ ప్రకృతి వనాల'పై అధికారులకు కలెక్టర్​ అభినందన

పట్టణ ప్రకృతి వనాలపై మహబూబ్​నగర్​ కలెక్టర్​ ఆరా తీశారు. పురపాలిక పరిధిలో మొక్కల పెంపకంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

mahabubnagar collector
'పట్టణ ప్రకృతి వనాల'పై అధికారులకు కలెక్టర్​ అభినందన

మహబూబ్​నగర్ పురపాలిక పరిధిలో పట్టణ ప్రకృతి వనాలు అందంగా తీర్చిదిద్దడం పట్ల కలెక్టర్ ఎస్.వెంకటరావు మున్సిపల్ కమిషనర్, సిబ్బందిని అభినందించారు.

జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని పాలనాధికారి సందర్శించారు. పెంచుతున్న మొక్కలు, సిబ్బంది, నీటిలభ్యత తదితర అంశాలపై ఆరాతీశారు. పురపాలిక పరిధిలో మొత్తం 22 పట్టణ ప్రకృతి వనాలు చేపట్టాల్సి ఉండగా... ఇప్పటివరకు 17 పూర్తిచేసినట్లు కలెక్టర్​కు వివరించారు. మరో మూడు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు.

'పట్టణ ప్రకృతి వనాల'పై అధికారులకు కలెక్టర్​ అభినందన

ఈ ఏడాది మహబూబ్​నగర్ పురపాలిక పరిధిలో సుమారు 10 లక్షల పండ్లు, పొడవైన పుష్పాలను ఇచ్చే మొక్కలను పూర్తి సాంకేతిక పద్ధతులతో పెంచాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. వెంకటేశ్వరకాలనీలో ప్రధాన రహదారి విస్తరణ, బైపాస్ రోడ్​ నిర్మాణంలో ఉన్న కల్వర్టును తనిఖీ చేశారు. పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

'పట్టణ ప్రకృతి వనాల'పై అధికారులకు కలెక్టర్​ అభినందన

ఇవీచూడండి:కొవిడ్ ఎఫెక్ట్ : వ్యక్తిగత వాహనాలవైపే ప్రజల మొగ్గు!

ABOUT THE AUTHOR

...view details