సమస్యలను పరిష్కరించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ మహిళా కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. మహబూబ్ నగర్ డిపో పరిధిలో పనిచేసే 18 మంది మహిళా కండక్టర్లు జిల్లా కేంద్రంలోని ఓ కండక్టర్ ఇంట్లో స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు. గత నలభై మూడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
స్వీయ గృహనిర్బంధం చేసుకున్న మహిళా కండక్టర్లు
ఆర్టీసీ కార్మికుల సమస్య పరిష్కారానికై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లాలో మహిళా కండక్టర్లు స్వీయ గృహ నిర్బంధం చేసుకున్నారు.
స్వీయ గృహనిర్బంధం చేసుకున్న మహిళా కండక్టర్లు
శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమ పట్ల పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఎక్కడ తమ నిరసనను వ్యక్త పరచకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ ఐకాస నాయకులను గృహనిర్బంధం చేయడంతోపాటు అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తామంతా గృహ నిర్భంధంలోనే ఉంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ గురించి ఎండీ సునీల్‌శర్మకు ఏం తెలుసు: అశ్వత్థామరెడ్డి