దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయానికి తక్కువ కేటాయింపులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆందోళనతో ప్రధాన రహదారిపై కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.
యూరియా కొరతపై కాంగ్రెస్ ధర్నా.. నిలిచిన రాకపోకలు - యూరియా కొరతపై కాంగ్రెస్ ధర్నా.. నిలిచిన రాకపోకలు
యూరియా కొరత, రైతు సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ నిరసన బాట పట్టింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

యూరియా కొరతపై కాంగ్రెస్ ధర్నా.. నిలిచిన రాకపోకలు
యూరియా కొరతపై కాంగ్రెస్ ధర్నా.. నిలిచిన రాకపోకలు
ఇవీ చూడండి: అటవీ అమరవీరులకు నివాళులర్పించిన మంత్రి