తెలంగాణ

telangana

ETV Bharat / state

వాల్యా తండాలో పిడుగు పడి తండ్రీకొడుకు మృతి - thunder

పిడుగుపడి తండ్రీకొడుకులు మృతి చెందిన ఘటన మహబూబాబాద్​ జిల్లా తానంచర్ల శివారు వాల్యాతండాలో చోటుచేసుకుంది. తండ్రీకొడుకుల మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వాల్యా తండాలో పిడుగు పడి తండ్రీకొడుకు మృతి

By

Published : Oct 15, 2019, 9:55 PM IST

పిడుగు ఓ కుటుంబాన్ని కబళించింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన తండ్రీకొడుకులను పొట్టన పెట్టుకుంది. ఈ విషాదకరమైన ఘటన మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు వాల్యాతండాలో చోటు చేసుకుంది. వాల్యాతండాకు చెందిన తేజావత్‌ కిషన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కిషన్‌ తన కుమారుడు తేజావత్‌ సంతోష్‌తో కలిసి పత్తి ఏరుతున్నారు. ఇదే సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
భారీ శబ్దంతో కిషన్‌, సంతోష్‌కు సమీపంలోనే ఒక్కసారిగా పిడుగుపడింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకు చనిపోవటంతో తండాలో తీవ్ర విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య తండాకు చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

వాల్యా తండాలో పిడుగు పడి తండ్రీకొడుకు మృతి

ABOUT THE AUTHOR

...view details