కాంగ్రెస్ పార్టీ బలహీనంగా మారిందని దిల్లీలో... గల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం డీకే అరుణ అని తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.
'కాంగ్రెస్ దిల్లీలో, గల్లీలో అధికారంలోకి రాదు'
"కాంగ్రెస్ పార్టీ దిల్లీలో... గల్లీలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడేందుకు నేతలు భయపడుతున్నారు... మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే 50 వేలకు పైగా మెజారిటీ సాధించాలి...ప్రతి కార్యకర్త గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరిని ఓటు వేయాలని అభ్యర్థించాలి" మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
'కాంగ్రెస్ దిల్లీలో, గల్లీలో అధికారంలోకి రాదు'