తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసుపత్రిలో ఉచిత భోజనం: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​

మహబూబ్​నగర్​ జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువుల కోసం మంత్రి శ్రీనివాస్​గౌడ్​.. మధ్నాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. లాక్​డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు.

 Minister Srinivas
Minister Srinivas

By

Published : May 21, 2021, 6:42 PM IST

మహబూబ్​నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చే.. రోగుల బంధువులకు భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటం వల్ల మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ భోజనాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి తన తండ్రి స్మారకార్థం ఏర్పాటు చేసిన.. శాంతా నారాయణ గౌడ్​ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో హోటళ్లు సైతం మూతపడటం వల్ల రోగుల వెంట వచ్చిన సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని... వారికి ప్రతిరోజు మధ్యాహ్నం ఆసుపత్రి ఆవరణలో ఉచితంగా భోజనం అందించనున్నామని వెల్లడించారు.

ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులకు లాక్​డౌన్​ కారణంగా భోజనానికి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి రోజు మధ్యాహ్నం ఉచితంగా భోజనం అందించేందుకు ముందుకు వచ్చినట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ శ్రీహిత వెల్లడించారు. లాక్​డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:సెంట్రల్​ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట

ABOUT THE AUTHOR

...view details