తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కృషి చేస్తున్నారు'

రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చే దిశగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్​ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే శంకర్​ నాయక్​తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలన్నారు.

minister sathyavathi rathod participated in harithaharam programme in mahabubabad district
'హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కృషి చేస్తున్నారు'

By

Published : Jul 16, 2020, 7:17 PM IST

మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 12వ వార్డులో గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్​తో కలిసి హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నుంచి రహదారి పక్కన 100 మొక్కలను నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాఠోడ్​ అన్నారు.

హరితహారంలో భాగంగా ప్రజలందరూ మొక్కలు నాటాలని మంత్రి కోరారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని గ్రీన్ ల్యాండ్​లు, పార్కులు, రహదారులకు ఇరువైపులా మొక్కలను నాటి... మున్సిపాలిటీలో 4.5 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డిలకు మంత్రి సూచించారు.

ఇవీ చూడండి:రైతువేదిక నిర్మాణానికి ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ

ABOUT THE AUTHOR

...view details