మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో జిల్లా పాలనాధికారి వీపీ గౌతమ్ పర్యటించారు. ఫ్రైడే- డ్రైడే సందర్భంగా మండలంలో కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. తొలుత మండల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పలు వీధుల్లో అధికారులతో కలిసి పర్యటించారు.
ఫ్రైడే- డ్రైడే సందర్భంగా కలెక్టర్ పర్యటన - collector visit updates
ఫ్రైడే- డ్రైడే సందర్భంగా మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యటించారు. పలు గ్రామాలను సందర్శించిన కలెక్టర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. హరితహారం మొక్కలను పరిశీలించి నీళ్లు పోశారు.

ఓ వీధిలో తాగి పడేసిన ఖాళీ కొబ్బరిబోండాలను జిల్లా కలెక్టర్ స్వయంగా తీసేశారు. అనంతరం పలువురు ఇళ్లకు వెళ్లి నీటి తొటి తొట్టిలను పరిశీలించారు. నిల్వ నీటిని తీసేయాలని సూచించారు. గ్రామంలో నాటిన హరితహారం మొక్కలను పరిశీలించి వాటికి నీళ్లు పోశారు. కౌసల్యదేవిపల్లి శివారులోని ఆకేరు వాగును పరిశీలించారు. వాగులో ఇసుక రవాణా, సాగునీటి లభ్యతకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అక్రమ ఇసుక రవాణా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని తనిఖీ చేశారు. వైద్య సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బొజ్జన్నపేటలో పర్యటించారు. గ్రామాల్లో చేపట్టిన పారిశుద్ధ్య పనుల తీరును పర్యవేక్షించారు.