రాష్ట్రంలో రాత్రి నుంచి అమలయ్యే కర్ఫ్యూను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజలందరూ పాటించాలని సీఐ వెంకటరత్నం కోరారు. కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తుండటంతో రాత్రి కర్ఫ్యూను విధిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అవగాహన కల్పించారు. ఏప్రిల్ 30 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
'కర్ఫ్యు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'
కరోనా విజృంభణ నేపథ్యంలో నేటి నుంచి అమలు కానున్న కర్ఫ్యూపై మహబూబాబాద్‌లో సీఐ వెంకటరత్నం అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని ప్రజలు సహకరించాలని కోరారు.
రాత్రి కర్ఫ్యూపై సీఐ అవగాహన, మహబూబాబాద్‌లో రాత్రి కర్ఫ్యూ
పట్టణ పరిధిలోని ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 8 గంటలల్లోపు వ్యాపార సముదాయాలను మూసివేయాలని ఆదేశించారు. అత్యవసర పనులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి:ఏపీలో కరోనా కల్లోలం.. గణనీయంగా పెరిగిన పాజిటివ్ కేసులు