కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ కేంద్రం ప్రారంభమైంది. పట్టణంలోని ప్రయాణ ప్రాంగణం వద్ద ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్నేళ్లుగా వేసవి కాలంలో నియోజకవర్గంలోని పలు మండలాల్లో ట్రస్ట్ ద్వారా అంబలి పంపిణీ చేస్తున్నారు. వేసవి కాలంలో అంబలి పంపిణీ చేయడం వల్ల భానుడి వేడి నుంచి ఉపశమనం పొందుతున్నామని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ
వేసవి కాలంలో ప్రజా సౌకర్యార్థం కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ ప్రారంభించారు. ఏటా వేసవిలో అంబలి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ తెలిపారు.
వేసవి కాలంలో ప్రజల దాహార్థిని తీరుస్తున్న అంబలి పంపిణీ