కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలం లోనవెల్లిలో విషాదం చోటుచేసుకుంది. తలసేమియా వ్యాధితో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. జనార్దన్, లావణ్య దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె యశస్వి... కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. పదిరోజులు కిందట జ్వరం రావటం వల్ల కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే యశస్వి ఈరోజు కన్నుమూసింది. అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురు మృతి చెందటం వల్ల తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
తలసేమియా వ్యాధితో ఆరేళ్ల చిన్నారి మృతి - Thalasemiyatho chinnari mruthi
రెండో తరగతి చదువుతోంది ఆ చిన్నారి. అప్పుడప్పుడూ మారాం చేస్తూ... ముద్దు ముద్దు మాటలతో కథలు చెప్పే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ప్రాణం. అలాంటి ప్రాణానికి ప్రాణమైన కూతురును అమ్మనాన్నలకు దూరం చేసింది తలసేమియా మహమ్మారి.

A six-year-old child with thalassemia