ఖమ్మం జిల్లా పెనుబల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. పాలకులు రాష్ట్రంలో ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్నారని.. దీంతో పేద, మధ్య తరగతుల ప్రజలు ఇసుకను కొనుగోలు చేయలేకపోతున్నారని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఇసుకను ప్రభుత్వమే ఉచితంగా అందించాలి'
ఇసుకను ఉచితంగా అందించాలని కోరుతూ సీఐటీయూ ప్రదర్శన చేపట్టింది.
ప్రభుత్వమే ఇసుకను ఉచితంగా ఇవ్వాలి