కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని లారీ అసోషియేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్పీఎం పరిశ్రమ నుంచి బయటకు వస్తున్న లారీని స్థానిక లారీ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. తమకు సరుకు రవాణా ఇవ్వకుండా బయటి వాహనాలకు ఇస్తున్నారని ఆరోపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు అసోసియేషన్ సభ్యులకు వాగ్వాదం చోటు చేసుకుంది. శంకర్ అనే లారీ యజమాని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు అతన్ని వెంటనే పోలీస్ స్టేషన్కు తరలించారు.
కాగజ్నగర్ లారీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత - lorry
ఎస్పీఎం పరిశ్రమ యాజమాన్యం స్థానికి లారీ అసోసియేషన్ వాహనాలకు సరుకు రవాణా ఇవ్వకుండా బయటవారికి ఇస్తున్నారంటూ స్థానిక లారీ ఓనర్లు లారీని అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, అసోసియేషన్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది.

పోలీసులు, లారీ ఓనర్లు