ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య పరిశీలించారు. జగన్ నగర్, మసీదు రోడ్డు, కాగల పల్లి రోడ్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. అనంతరం హిందూ శ్మశాన వాటిక, జేవియర్ పార్కు అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. జగన్ నగర్లో పాల కేంద్రం వద్ద రహదారి ఏర్పాటు చేసి తమ ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరారు.
పట్టణ ప్రగతి కార్యక్రమానికి కేటీఆర్ వస్తున్నారు: సత్తుపల్లి ఎమ్మెల్యే
సత్తుపల్లి పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ రానున్నట్లు ఎమ్మల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. సత్తుపల్లిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు.
పట్టణ ప్రగతి కార్యక్రమానికి కేటీఆర్ వస్తున్నారు: సత్తుపల్లి ఎమ్మెల్యే
సత్తుపల్లిలో పట్టణ ప్రగతిని పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ మార్చి 4న రానున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆ లోపు పనులు పూర్తి చేయాలని అధికారులు, ఛైర్మన్‌కు సూచించారు.