కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర యువజన సంఘం తల్లాడ వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గం ఆంధ్ర సరిహద్దులో ఉన్నందున కరోనా కేసులు పెరగకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం కరోనా బాధితులకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే - దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కరోనా బాధితులకు, దివ్యాంగులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిత్యావసర సరుకులను అందజేశారు. కరోనా నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందజేసిన ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి ఆసుపత్రి మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బాధితులకు, మూడు చక్రాలపై నడిచే దివ్యాంగులను గుర్తించి వారికి సాయం చేయడం అభినందనీయమని తల్లాడ యూత్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ రెడ్డెం వీర మోహన్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'