ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు బస్ రోకో నిర్వహించారు. డిపో నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న బస్సును అడ్డుకుని దాని ముందు బైఠాయించారు. బస్సును తిరిగి బస్టాండ్‌కు తిరిగి పంపించారు పోలీసులు. అనంతరం కార్మికులందరూ ముక్కును నేల రాసి నిరసన తెలిపారు. మహిళా కార్మికులు చెప్పులతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.
చెప్పులతో కొట్టుకుంటూ..ముక్కు నేలకు రాసి నిరసన - rtc wokers strike updates in khammam
ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. డిపో నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. విలీనంపై వెనక్కి తగ్గినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనలేకపోవడం దారుణమన్నారు.

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన... బస్టాండ్ ఎదుట బైఠాయింపు
అనంతరం మయూరి కూడలిలో మానవహారం నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌పై వెనక్కి తగ్గిన సర్కారు నుంచి సానుకూల స్పందన లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన... బస్టాండ్ ఎదుట బైఠాయింపు