నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారులివి. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాలకు చేరేందుకు ఇవే ఆధారం. గతేడాది కాలంగా ఈ మార్గాలన్నీ దుర్భరంగా మారి.. ప్రమాదాలకు నిలయంగా తయారయ్యాయి.
మధిర నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారితోపాటు, మధిర-నందిగామ రోడ్డు, మధిర-తిరువూరు మార్గాలకు గుంతలు ఏర్పడ్డాయి. వర్షాలు పడినప్పుడు గుంతల్లో నీరు చేరి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా రహదారులు మరమ్మతులకు నోచుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.