తెలంగాణ

telangana

ETV Bharat / state

Pet Lover : మూగజీవాలంటే ఆమెకు ప్రాణం.. అందుకే

మూగజీవాలంటే ఆమెకు ఎనలేని ప్రేమ. అందులో శునకాలంటే మరింత ఎక్కువ ఇష్టం. అందుకే వాటికి చిన్న దెబ్బ తగిలినా ఆమె మనసు తల్లడిల్లిపోతుంది. మూగజీవాలపై ఈమెకున్న ప్రేమే వాటి పాలిట వరమైంది. వీధి శునకాలు వ్యాధుల బారిన పడినా.. చిన్నగాయమైనా వాటిని ఇంటికి తెచ్చుకుంటున్నారు. వాటికి వైద్యమందించి సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు మేకల పద్మ.

Pet Lover
Pet Lover

By

Published : Apr 11, 2022, 9:20 AM IST

మూగజీవాలు అందులో శునకాలంటే ఆమెకు ప్రాణం. వాటికి చిన్న గాయమైనా చలించిపోతారు. ప్రమాదాలకు గురైన, జబ్బుల బారి పడిన వీధి శునకాలకు అమ్మ అవుతున్నారీ మేకల పద్మ. వాటిని పెంచి పోషిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఖమ్మం శివారు దానవాయిగూడెంలో రూ.10 వేలకు ఇల్లు అద్దెకు తీసుకుని అరవైకి పైగా శునకాలను పెంచి పోషిస్తున్నారు. వాటి కోసం బోన్లు, కూలర్లు, మంచాలు, పరుపులు కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నా మూగజీవాలనే తన బిడ్డలుగా భావిస్తున్నారు. కూలి పనులు చేసే కుమారులు, బెంగళూరులో ఉంటున్న కుమార్తె సాయంతో శునకాల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలెవరైనా ఆహార సామగ్రి రూపంలో ఇస్తే తీసుకుంటారు తప్ప నగదును అంగీకరించరు. ఈ ఆశ్రమంలో శునకాలతో పాటు పిల్లులు, కుందేళ్లు, గుర్రం కూడా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details