రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అన్ని రంగాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కరోనా సంక్షోభంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారన్నారు.
'సంక్షేమ పథకాలతో అన్ని రంగాల ప్రజలకు లబ్ధి' - khammam news
ఖమ్మం జిల్లా ఏన్కూరులో ఎమ్మెల్యే రాములు నాయక్ పర్యటించారు. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని... నియంత్రిత సాగుతో పాటు రైతుబంధు వంటి పథకాలతో భరోసాగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

mla ramulu nayak visited in enkuru mandal
ఆరోగ్యశ్రీతో పాటు సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు వైద్య సాయం కోసం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రధానంగా వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని... నియంత్రిత సాగుతో పాటు రైతుబంధు వంటి పథకాలతో భరోసాగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాదావత్ మార్కెట్ ఛైర్మన్ లాలు నాయక్, జూలూరుపాడు మండల తెరాస మండల అధ్యక్షులు సురేశ్ నాయక్ నరసింహారావు పాల్గొన్నారు.