ధరణిని కాపాడుకోవడం మానవ బాధ్యత అంటూ ఖమ్మంలో వైబ్రాంట్స్ ఆఫ్ కలాం అనే స్వచ్ఛంద సంస్థ వినూత్న సందేశమిచ్చింది. నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ధరణి దీక్ష పేరుతో భూమిని కాపాడాలంటూ ప్రచారం చేస్తున్నారు. 7 ఖండాలు, 5 మహాసముద్రాలకు నిదర్శనంగా వైబ్రాంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపకుడు విజయ్ కలాం నాయకత్వంలో మొత్తం 12 మంది సంస్థ సభ్యులు ధరణి దీక్ష నిర్వహించారు. పుడమి మనుగడ కోసం మానవజాతి కదలాలని పిలుపునిస్తూ... శరీరాన్నంతా మట్టిలో పూడ్చుకున్నారు. కేవలం మొహం మాత్రమే కనిపించేలా చేసిన ఈ దీక్షకు విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు మద్దతు పలికారు.
పీకల్లోతు వరకు మట్టిలో... ఖమ్మం యువత వినూత్న దీక్ష
అనంతమైన విశ్వంలో జీవకోటికి నివాసయోగ్యమైన గ్రహం ఒక్క భూమి మాత్రమే. అంతటి మహత్యమున్న పుడమి... మానవ జాతి విశృంఖల చర్యలతో నాశనమైపోయే స్థితికొచ్చింది. కాలుష్యకాటుకు బలవుతున్న నేలతల్లిని పదిలంగా భవిష్యత్ తరాలకు అందించాలంటే చర్యలు తీసుకోవాల్సిందేనంటూ వినూత్న ప్రచారం చేస్తున్నది ఖమ్మం యువత.
పీకల్లోతు వరకు మట్టిలో... ఖమ్మం యువత వినూత్న దీక్ష