ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు సమావేశం అయ్యారు. ఖమ్మం సుందరయ్య భవన్‌లో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం తమ్మినేని వీరభద్రంలు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణలో నిరుద్యోగం పెరుగుతోంది: చాడ, తమ్మినేని - ఖమ్మంలో సీపీఐ సీపీఎం నేతల సమావేశం
ప్రజలను మభ్యపెడుతూ.. అబద్దాలు చెప్పి గడిపేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గరపడ్డాయని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ, తమ్మినేనిలు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం సుందరయ్య భవన్‌లో ముఖ్యనాయకుల సమావేశానికి వారు హాజరయ్యారు.

రోజురోజుకు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది: చాడ, తమ్మినేని
రాష్ట్రంలో నిరుద్యోగుల రేటు రోజు రోజుకు పెరుగుతుందన్నారు. ప్రజలను మభ్యపెట్టి కాలక్షేపం చేస్తూ అబద్దాలు చెప్పే కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే శక్తి జయసారథికి మాత్రమే ఉందని ఆయనకు మద్దతు ఇచ్చే ఆలోచన చేయాలన్నారు.
ఇదీ చూడండి:రైతుకు సాయం.. యువతకు ఆదాయం!