ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజరలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య లబ్ధిదారులకు అందజేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని 27 మందికి రూ.16 లక్షలు మంజూరు కాగా... చెక్కులను పంపిణీ చేశారు. వైద్యం ఖరీదైన ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి చేయటం తన బాధ్యతన్నారు. వైద్యశాలలో మార్చురీ కోసం రూ. 50 లక్షలు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
'నియోజకవర్గంలో వైద్య సేవలు మెరుగుపరుస్తాం' - CMRF CHEQUES DISTRIBUTION BY MLA GANDRA VENKATAVEERAIH
పేదలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఖమ్మం జిల్లా వీఎం బంజరలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

CMRF CHEQUES DISTRIBUTION BY MLA GANDRA VENKATAVEERAIH