తెలంగాణ మహిళలకు అతిపెద్ద పండుగైన బతుకమ్మను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతోషంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని తెరాస పార్టీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలను ఆయన ప్రారంభించారు. మహిళా కార్యకర్తలు బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చి పూజలు చేశారు.
ఖమ్మంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ పండుగ తొలిరోజు వేడుకలను ఖమ్మంలోని తెరాస కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు. మహిళా కార్యకర్తలంతా బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.
ఖమ్మంలో బతుకమ్మ సంబురాలు
మహిళలంతా బతుకమ్మల చుట్టూ చేరి ఆడి పాడారు. సంకల్ప స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా పిల్లలు బతుకమ్మ ఆడారు. పెద్ద బతుకమ్మను పేర్చి చుట్టూ చేరి కోలాటాలతో సందడి చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో సందడిగా మొదలైన బతుకమ్మ వేడుకలు