Tensions in Karimnagar: తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజుంతా కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీశాయి. మెదట బండి పాదయాత్రను నిలిపివేసిన పోలీసులు ఆతరవాత ఆయన్ను అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు. అనంతరం 24 గంటలు గృహ నిర్భందంలో ఉండాలంటు ఆదేశాలు జారీ చేశారు. అటు కవితపై చేసిన వ్యాఖ్యలకు గాను తెరాస నేతలు పెద్ద ఎత్తున హాజరై బండి ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని కొందర్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
నిరసనలు, అరెస్టులు, గృహనిర్భంధంతో కరీంనగర్లో ఉద్రిక్తత
Tensions in Karimnagar నిన్న తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కరీంనగర్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బండి సంజయ్ ఇంటిని కొందరు తెరాస కార్యకర్తలు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
ఇది జరిగింది: నిన్న హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడి చేపట్టిన భాజపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేయడాన్ని నిరసిస్తూ బండి సంజయ్ ధర్మదీక్ష చేయాలని నిర్ణయించారు. అడ్డుకున్న పోలీసులు... జనగామ జిల్లా పామ్నూర్ శిబిరం వద్ద సంజయ్ ను అరెస్టుచేశారు. ఈ క్రమంలో పోలీసు వాహనాన్ని భాజపా శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భాజపా కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో... కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ శ్రేణుల తోపులాటల నడుమే సంజయ్ ను అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి కరీంనగర్ జైలుకు తరలించారు.
ఇవీ చదవండి: