కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో ఆరుకుటి కొమురయ్య అనే వ్యక్తి సెల్ టవర్ పైకెక్కి నిరసన తెలిపాడు. తనకు రావాల్సిన డబ్బులు అడిగితే ముగ్గురు వ్యక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయాడు.
సెల్‌టవర్ పైకెక్కి ఓ వ్యక్తి నిరసన
తనకు రావాల్సిన డబ్బులు అడిగితే ముగ్గురు వ్యక్తులు చంపుతామని బెదిరిస్తున్నారని కరీంనగర్ జిల్లా కురిక్యాలలో ఓ వ్యక్తి సెల్‌టవర్ పైకెక్కి నిరసన తెలిపాడు. ఎస్సై, సర్పంచ్ రక్షణ కల్పిస్తామని తెలపటం వల్ల సురక్షితంగా కిందికి దిగాడు.
సెల్‌టవర్ పైకెక్కి ఓ వ్యక్తి నిరసన
ఎస్సై వివేక్, సర్పంచ్ నవీన్ రావులు సెల్ టవర్ వద్దకు చేరుకుని ఫోన్లో సముదాయించారు. బెదిరిస్తున్న వారి నుంచి రక్షణ కల్పిస్తామని తెలపటంతో సెల్ టవర్ పైనుంచి సదరు వ్యక్తి సురక్షితంగా దిగాడు.
ఇవీ చూడండి: తాగిన మత్తులో విద్యుత్ నియంత్రికను పట్టుకుని ప్రాణం కోల్పోయాడు