ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. పురపాలక ఎన్నికల్లో తమకు అత్యధిక స్థానాల్లో విజయావకాలు ఉన్నందున కొత్త చట్టం పేరుతో బెదిరించేందుకు విఫలయత్నం చేశారని ధ్వజమెత్తారు. కరీంనగర్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై అవగాహన కల్పించారు. నూతన చట్టం పేరుతో స్థానిక సంస్థల హక్కులను కాలరాసేందుకు కేసీఆర్ యత్నించినా.. ఆ బిల్లును గవర్నర్ వెనక్కి పంపించడాన్ని స్వాగతించారు.
సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పురపాలక ఎన్నికల ప్రచారంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అవగాహన కల్పించారు. నూతన పురపాలక చట్టం పేరుతో స్థానిక సంస్థలను కాలరాసేందుకు కేసీఆర్ యత్నించారని ఆరోపించారు. పురపాలక బిల్లును గవర్నర్ తిప్పిపంపడాన్ని స్వాగతించారు.
రాజ్యాంగంలోని 73, 74 అధికరణలు తీసుకొచ్చి స్థానిక సంస్థలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే సీఎం కేసీఆర్ దానికి భిన్నంగా వ్యవహరించడం దారుణమన్నారు. స్థానిక సంస్థలకు నిర్ణయాధికారమే తప్ప అమలు బాధ్యత లేదనే విషయాన్ని కనీసం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి ప్రవర్తించారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు. గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని.. దీనికి నైతిక బాధ్యత వహించి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'కొత్త అసెంబ్లీ డిజైన్ వివరాలివ్వండి'
TAGGED:
mlc jeevan reddy