Gangula Kamalakar on Double bedroom: రెండు పడక ఇళ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్రూం ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి మంత్రి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి గృహ ప్రవేశం చేయించారు. కరీంనగర్ జిల్లాలోనే తొలిసారి కమాన్పూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిర్మించిన ఇళ్లకు విద్యుత్ మీటర్లు, తాగునీటి సరఫరా కల్పించినట్లు ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు సొంత ఇళ్ల కలను సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రి లాంటి వాడని, దైవంతో సమానమని, దైవ స్వరూపులని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
వెంటనే డబుల్ బెడ్రూం ఇళ్లలోకి మారాలి..
minister gangula kamalakar: మొత్తం 67 ఇళ్లలో కమాన్పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్ఎండీ ముంపుకు దగ్గరగా ఉన్నాయని, వారికి పునరావాసం కింద ఇళ్లు కేటాయించామని ఆయన తెలిపారు. 47 మందిలో 36 కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించామని , మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అర్హులైన వారికి అధికారులు కేటాయిస్తారని వెల్లడించారు. మిగిలిన డబుల్ బెడ్రూం ఇళ్లను కమాన్పూర్ గ్రామస్థులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ కుటుంబసభ్యులతో సహా సంతోషంగా గృహప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు. రాములపల్లి గ్రామస్థులు గృహాలను వెంటనే ఖాళీ చేసి నూతనంగా కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లలోకి మారాలని ఆయన కోరారు.
ఎవరికి అమ్ముకోరాదు.. కిరాయికి ఇవ్వరాదు