కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం 5 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రోజు పాలకవర్గం చివరి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రవీందర్ సింగ్‌తో పాటు కార్పొరేటర్లను కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి సన్మానించారు. గత ఐదేళ్ల కాలంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో పథకాలు ప్రారంభించామన్నారు రవీందర్ సింగ్. ప్రధానంగా ఒక్కరూపాయికే కుళాయి కనెక్షన్‌తో పాటు ఒక్క రూపాయికే అంత్యక్రియలు, ఆఖ్రీ సఫర్ పథకాలు కార్పొరేషన్‌కు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు.
'ఎన్నో పథకాలు ప్రారంభించాము'
ఐదేళ్లు పూర్తి చేసిన కరీంనగర్ మేయర్‌తో పాటు పాలకవర్గానికి వీడ్కోలు సమావేశం జరిగింది. కార్పొరేటర్లను కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి సన్మానించారు.
మేయర్‌ను సన్మానిస్తూ