బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనే ముందస్తు సమాచారం మేరకు ఠాణా సమీపంలోనే వాహనాల తనిఖీ చేపట్టామని హుజూరాబాద్ పోలీసులు అన్నారు. లారీని తనిఖీ చేయగా అక్రమ రేషన్ బియ్యంగా గుర్తించినట్లు చెప్పారు. 50 కేజీల బరువు గల 550 సంచులను రవాణా చేస్తున్నట్లు వివరించారు.
లారీ డ్రైవర్ జిల్లెల్ల నరేష్, సాయిల్ల రాజు అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని గొండియా ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. వీరితో పాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని వెల్లడించారు. పరారీలో నలుగురు వ్యక్తులు ఉన్నారని..అరెస్టు చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.
'అక్రమ బియ్యం పట్టివేత' - HUZURABAD POLICE
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సుమారు 450 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు పట్టణ సీఐ మాధవి తెలిపారు.

తక్కువ ధరకు కొనుగోలు చేసిన బియ్యం మహారాష్ట్రకు తరలింపు
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం
ఇవీ చూడండి : భట్టి దీక్షతో బయటపడ్డ విభేదాలు