కరీంనగర్-2 డిపో డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణించడం పట్ల ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. బాబు అకాల మరణం కారణంగా కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికులు ఈ రోజు జిల్లా వ్యాప్త బంద్కు పిలుపునిచ్చారు.
కరీంనగర్లో బంద్.. ఆర్టీసీ కార్మికుల అరెస్టులు
కరీంనగర్-2 డిపోకు చెందిన డ్రైవర్ బాబు ప్రభుత్వ వైఖరి పట్ల కలత చెందినందునే గుండెపోటుతో చనిపోయాడని తోటి కార్మికులు ఆరోపించారు. సరూర్ నగర్‌లో జరిగిన సకల జనుల భేరికి హాజరైన బాబు గుండెపోటుతో మృతి చెందాడు. నిరసనగా కార్మికులు ఒక్కరోజు కరీంనగర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు.
కరీంనగర్లో బంద్.. ఆర్టీసీ కార్మికుల అరెస్టులు
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని కార్మికులు ఆరోపించారు. బస్టాండ్ వద్ద సీపీఎం, సీపీఐ, ఆర్టీసీ ఐకాస నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి : అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు