చాలా మంది వాహనదారులు ఈ-చలాన్ల నుంచి తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం, నంబర్ ప్లేట్‌ను తీసివేయడం, తప్పుడు ప్లేట్‌ను పెట్టుకుని తిరుగుతున్నారని కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు.
ఒకే వాహనానికి 54 చలాన్లు పెండింగ్.. - 54 e-challans for a vehicle in karimnagar
చాలా మంది వాహనాదారులు ఈ-చలాన్లు తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది గమనించిన పోలీసులు అలాంటి వాహనాలు గుర్తించేందుకు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి వాహనానికి 54 చలాన్లు పెండింగ్ ఉండటం గమనించారు.
పెండింగ్ చలాను కడితేనే.. బండి ఇచ్చేది!
ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వాహనానికి 54 చలాన్లు పెండింగ్ ఉండటం గుర్తించారు. పెండింగ్‌లో ఉన్న రూ.15,884 నగదును క్లియర్ చేయించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో నంబర్ ప్లేట్ లేని 25 వాహనాలకు పెండింగ్ ఉన్న రూ.65,975లను వాహనదారులు చెల్లించిన తర్వాతే వాహనాలు అప్పగించారు.
- ఇదీ చదవండి :నకిలీ చలాన్ల కేసులో అబ్కారీ శాఖ విచారణ